రాంచ‌ర‌ణ్‌ను ఆదుకున్న చంద్ర‌బాబు

mohanrao
ram

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మెగా స్టార్ చిరంజీవి త‌న‌యుడు రాంచ‌ర‌ణ్‌ను ఆదుకున్నారు. రాం చ‌ర‌ణ్‌ను చంద్ర‌బాబు ఆదుకోవ‌టం ఏమిట‌నే డౌట్ వ‌స్తుందా? చ‌ద‌వండి ఈ స్టోరీ.

మెగా ఇంజ‌నీరింగ్ విమాన‌యాన సంస్ధ రాంచ‌ర‌ణ్ డైరెక్ట‌ర్‌గా ఉన్న సంగ‌తి తెల్సిందే. ఈ ట‌ర్బో ఎయిర్ వేస్ సంస్ధ ఏపీలో విమానాల‌ను న‌డుపుతోంది. ఈ సంస్ధ పీక‌ల్లోతు న‌ష్టాల్లో కూరుకుపోయింది. మొద‌టి నుంచి ఏపీలో విమాన‌యానానికి ప్రాధాన్య‌త ఇస్తున్న చంద్ర‌బాబు నాయుడు ఈ సంస్ధ‌ను ఆదుకోవాల‌ని నిర్ణ‌యించారు. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌ర్దుబాటు నిధి( వీజీఎఫ్‌) నుంచి 4,90 కోట్ల రూపాయ‌లు చెల్లించారు. విజ‌య‌వాడ‌- తిరుప‌తి- విజ‌య‌వాడ‌, విజ‌య‌వాడ‌- క‌డ‌ప‌- విజ‌య‌వాడ రూట్ల‌లో స‌ర్వీసులు న‌డిపినందుకు గాను ఈ ఎయిర్ వేస్‌కు ప్ర‌భుత్వం ఈ సంస్ద‌ను ఆదుకుంది. ప్ర‌భుత్వం నుంచి ఇదే త‌ర‌హా సాయం భ‌విష్య‌త్‌లో కూడా అందుతుంద‌ని తెలుస్తోంది.

అయితే ప్ర‌భుత్వం ఈ విధ‌మైన సాయం మాత్ర‌మే కాకుండా మ‌రో విధంగా కూడా విమాన‌యానాన్ని ప్రోత్స‌హిస్తోంది. విమానాల్లో ఉప‌యోగించే ఇంథ‌నం ఏవిమేష‌న్ ట‌ర్బైన్ ప్యూయ‌ల్ పై (ఏటీఎప్‌) అతి త‌క్కువ పన్ను వేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ఒక‌టి. ఇది ప్ర‌బుత్వం నుంచి మొద‌టి నుంచి అందుతుంది. అయిన‌ప్ప‌టికీ న‌ష్టాలు రావ‌టంతో ప్ర‌భుత్వం మ‌రో విధంగా కూడా ఆదుకుంది. ఏపీలో ఎయిర్ ఫోర్టులు నిర్మించ‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్న ప్ర‌భుత్వం విమానయాన సంస్ధ‌ల‌కు న‌ష్టాలు వ‌స్తే ఏపీలో విమానాలు న‌డ‌ప‌డానికి ఎవ‌రూ ముందు రార‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం నుంచి ఈ సాయం చేశారని తెలుస్తోంది. అంతే కాకుండా మెగా ఫ్యామిలీ లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చంద్ర‌బాబుకు మంచి సంబంధాలే ఉన్నాయి. వాటి కొన‌సాగింపుకుల ఈ చ‌ర్య దోహద ప‌డుతుంద‌ని అంటున్నారు.

Tags : , , , , , , ,