`అత్తారిల్లు` మూవీ రివ్యూ

Surendra
athaarillu

`అత్తారిల్లు` మూవీ రివ్యూ

రిలీజ్ తేది : 16 -09- 2016

జోన‌ర్‌: హార‌ర్‌

రేటింగ్ : 2.5 / 5

నటీనటులు : సాయి రవికుమార్, అథితి దాస్ తదితరులు

సంగీతం : డెన్నిస్ నార్ట‌న్‌

ఆర్‌.ఆర్‌: మ‌ణిశ‌ర్మ‌

ద‌ర్శ‌క‌నిర్మాత‌ : అంజన్.కె. కళ్యాణ్

ఇటీవ‌లి కాలంలో హారర్ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌, కాంచ‌న‌, గంగ, రాజుగారి గ‌ది వంటి హార‌ర్ చిత్రాలు రికార్డు స్థాయిలో వ‌సూళ్లు సాధించాయి. అదే కోవ‌లో మ‌రో ఎటెంప్ట్ – అత్తారిల్లు. స‌హాయ‌ద‌ర్శ‌కుడిగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న అంజ‌న్‌.కె.క‌ళ్యాణ్ తొలి ప్ర‌య‌త్న‌మిది. అంతా కొత్త కుర్రాళ్ల‌తో ఈ చిత్రానికి కెప్టెన్సీ చేస్తూనే నిర్మాత‌గానూ ఆయ‌న డ‌బుల్‌రోల్ పోషించారు. అయితే హార‌ర్‌ను తొలి ప్ర‌య‌త్నంగా ఎంచుకున్న‌ ఈ న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మైందా? లేదా? అన్న‌ది తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.

సింగిల్ లైన్‌:

పెళ్లంటే భ‌య‌ప‌డే స్నేహితుడిని ఒప్పించేందుకు స్నేహితులు `అత్తారిల్లు`కు దారి వెతుక్కుంటూ వెళితే.. అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? అన్న‌దే సినిమా క‌థాంశం.

క‌థ‌క‌మామీషు:

ర‌ణధీర్‌(సాయిర‌వి), కృష్ణ‌మూర్తి, ద‌యానంద్ ఈ ముగ్గురూ మంచి స్నేహితులు. అయితే అందులో ద‌యానంద్‌కి ఓ రాత్రి అనూహ్య‌మైన క‌ల వ‌స్తుంది. తాను పెళ్లి చేసుకున్న‌ట్టు.. పెళ్ల‌య్యాక భార్య చ‌నిపోయి దెయ్యంగా మారిన‌ట్టు క‌ల వ‌స్తుంది. ఇక ఆరోజునుంచి అత‌డిలో ఒక‌టే భ‌యం. ఆ దెయ్యం ఏదో ఒక‌రోజు త‌న‌ని చంపేస్తుంద‌న్న ఇన్‌ఫీరియారిటీతో ఉంటాడు. అయితే ద‌యానంద్ తండ్రి (పొలిటీషియ‌న్‌) ఈ స‌మ‌స్య‌కు సొల్యూష‌న్ వెత‌క‌మ‌ని ద‌యా స్నేహితులు ర‌ణ‌ధీర్‌, కృష్ణ‌మూర్తిని అడుగుతాడు. ఏదైనా కొత్త ప్లేసుకి వెళితే అతడిలో మార్పు వ‌స్తుంద‌ని కోర‌తాడు. ఎలాగోలా ద‌యానంద్‌ను పెళ్లికి ఒప్పించాల్సిందిగా స్నేహితుల్ని ప్రాధేయ‌ప‌డ‌తాడు. క‌ట్ చేస్తే సీన్ .. ఓ నిర్జ‌న‌ప్ర‌దేశంలో ఉన్న మారుమూల భ‌వంతికి మారుతుంది. అదే అస‌లైన అత్తారిల్లు. ఇక అక్క‌డినుంచి ఆ స్నేహితుల‌కు ఎదురైన స్వానుభ‌వాలేంటి? క‌థ‌లో ప్ర‌వేశించిన కొత్త ట్విస్టేంటి? అస‌లింత‌కీ ద‌యానంద్ భ‌యం వీడి పెళ్లికి ఒప్పుకున్నాడా? లేదా? పిల్ల దొరికిందా? లేదా? అస‌లు అత్తారిల్లు మీనింగేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథలో ట్విస్టు:

ఈ క‌థ‌లో ఓ ట్విస్టు ఇంట్రెస్టింగ్‌. డైరెక్ష‌న్ ఛాన్సుల కోసం ఓ దెయ్యం స్క్రిప్టు ప‌ట్టుకుని తిరుగుతున్న ర‌ణ‌ధీర్ జ్వాల (అతిధి దాస్‌) ల‌వ్‌లో ప‌డ‌తాడు. జ్వాల అభిన‌వ క‌థానాయిక‌. అయితే ఈ బ్యాచి అంతా రిహార్స‌ల్స్ కోసం `అత్తారిల్లు` వెతుక్కుంటూ వెళ‌తారు. అక్క‌డ దెయ్యం ఆడిన వింతాట‌? ఏంట‌నేది ఇంట్రెస్టింగ్‌. అస‌లు దెయ్యం ఎవ‌రు? జ‌్వాల క‌థ‌లో ట్విస్టేంటి? అన్న‌ది తెర‌పైనే చూడాలి.

ప్ల‌స్‌లు:

ప్ర‌థ‌మార్థం ఇంట్రెస్టింగ్‌

ర‌ణ‌ధీర్‌, జ్వాల పాత్ర‌ల అభినివేశం

మైన‌స్‌లు :

ముందే తెలిసిపోయే క‌థ‌నం

రొటీన్ స్టోరి

దెయ్యం ఎపిసోడ్స్‌లో కొంత త‌డ‌బాటు

పెర్ఫామెన్సెస్‌:

హార‌ర్ సినిమాల్లో హీరోకి ప్రాధాన్య‌త ఏం ఉంటుంది? భ‌య‌పెట్ట‌డ‌మే ప్ర‌ధానం అనుకుంటాం. కానీ ఈ చిత్రంలో హీరో పాత్ర చాలా చ‌క్క‌గా కుదిరింది. అలాగే జ్వాల పాత్ర‌లో అతిధి ముఖాభిన‌యం ప‌దే ప‌దే త‌లంపుకు తెచ్చేలా తీర్చిదిద్దారు. గ్లామ‌ర్‌తో పాటు ఎక్స్‌ప్రెష‌న్‌లో మెప్పించింది అతిధి. కృష్ణ‌మూర్తి క్యారెక్ట‌రైజేష‌న్ హాస్యం పండించ‌డంలో స‌క్సెసైంది. ఇత‌ర న‌టీన‌టులు ప‌రిధిమేర త‌మ పాత్ర‌ల్లో ఇమిడిపోయారు.

టెక్నీషియ‌న్స్‌:

ముఖ్యంగా హార‌ర్ సినిమాల‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్‌. ఆ పార్ట్‌లో మ‌ణిశ‌ర్మ‌ను ఉప‌యోగించ‌డం పెద్ద ప్ల‌స్ అయ్యింద‌నే చెప్పాలి. అంజ‌న్‌.కె ద‌ర్శ‌కుడిగానే కాదు, మాట‌ల ర‌చ‌యిత‌గా, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ సాధించుకున్నాడు. అయితే కామెడీ టైమింగును తీర్చిదిద్ద‌డంలో అత‌డు మ‌రింత బెట‌ర్ అవ్వాల్సి ఉంటుంది. వ‌రుస‌గా హారర్ సినిమాలు వ‌స్తున్న‌ప్పుడు కంటెంట్‌లో ఎక్స్‌క్లూజివ్ నెస్ కోసం ప్ర‌య‌త్నించి ఉంటే మ‌రింత మంచి ఫ‌లిత‌మే ద‌క్కేది. ఏదేమైనా కొత్త కుర్రాళ్లంతా క‌లిసి చేసిన తొలి ప్ర‌య‌త్నం మెచ్చ‌ద‌గిన‌ది. నిర్మాణ విలువ‌ల ప‌రంగా గుడ్. క్వాలిటీ కెమెరా వ‌ర్క్ క‌నిపించింది. పాట‌లు ఫ‌ర్వాలేదు.

ముగింపు:

టైమ్ పాస్ మూవీ ఇది. హార‌ర్‌.. మ‌రీ అంత భ‌య‌పెట్ట‌క‌పోయినా మితిమీరిన క‌న్ఫ్యూజ‌న్ లేని క‌న్విన్సింగ్ ఎటెంప్ట్‌.

Tags :