మ‌హేష్ కోసం `సంఘ‌మిత్ర‌` టైటిల్..!

Surendra
mahesh

ప్రిన్స్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించే కొత్త సినిమా కోసం ఫిలింఛాంబ‌ర్‌లో ‘సంఘ‌మిత్ర’ అనే టైటిల్ రిజిస్ట‌ర్ చేశార‌ని స‌మాచారం.

మ‌హేష్ ప్ర‌స్తుతం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తూనే మ‌రో రెండు ప్రాజెక్టుల‌కు క‌మిటైన సంగ‌తి తెలిసిందే. మురుగ‌దాస్ త‌ర్వాత కొర‌టాల శివ‌, పూరి జ‌గ‌న్నాథ్ లైన్‌లో ఉన్నారు. ఆ త‌ర్వాత ప్రాజెక్టు ఎవ‌రితో? అన్న‌దానిపై క్లారిటీ వ‌చ్చింద‌నే అంటున్నారు.

మ‌హేష్ కోసం ‘శంభో శివ శంభో’ డైరెక్ట‌ర్ సుంద‌ర్‌.సి ఓ డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్ రెడీ చేశారు. ఇది తెలుగు, త‌మిళ్ ద్విభాషా చిత్రం. త‌మిళ్‌లో జ‌యం ర‌వి, తెలుగులో మ‌హేష్ న‌టిస్తారు. ఈ విష‌యంపై ఇది వ‌ర‌కే ప్ర‌చారం సాగినా.. అప్ప‌ట్లో క‌న్ఫ‌మ్ కాలేదు. తాజాగా సుంద‌ర్‌.సి ఫిలింఛాంబ‌ర్‌లో `సంఘ‌మిత్ర‌` టైటిల్‌ని రిజిష్ట‌ర్ చేయించారుట‌. ఇది మ‌హేష్‌ కోస‌మేన‌నే టాక్ న‌డుస్తోంది.

Tags : , , , , , , , , ,