వ‌స్తూనే హ్యాట్రిక్ కొట్టిన మొట్ట‌మొద‌టి మొన‌గాడు!!

Surendra
korataala

సినిమా రంగంలోకి వ‌స్తూనే మొద‌టి మూడు సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్ హ్యాట్రిక్ కొట్టిన ఏకైక ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ

మొద‌టి మూడు సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టి … తొలి హ్యాట్రిక్‌తో భ‌ళా అనిపించిన ఏకైక ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మాత్ర‌మే. మ‌న‌కు ఎందరు స్టార్ డైరెక్ట‌ర్లు ఉన్నా.. గ‌ణాంకాల ప్ర‌కారం ఈ ఫీట్ సాధించింది ఆయ‌నొక్క‌డే.

కొర‌టాల శివ డెబ్యూ మూవీ ‘మిర్చి’ 70 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. సెకెండ్ మూవీ ‘శ్రీమంతుడు’ 150 కోట్ల‌కు పైగా కొల్ల‌గొట్టింది. ఇక థ‌ర్డ్ మూవీ ‘జ‌న‌తా గ్యారేజ్’ మూడు వారాల్లోనే 75 కోట్ల వ‌సూళ్లు సాధించింది. హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ గా…ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ డైరెక్ట‌ర్ గా ప్రూవ్ అయిన తొలి డైరెక్ట‌ర్ కొర‌టాల‌నే. ఇప్ప‌ట్లో ఆయ‌న్ను టాలీవుడ్ లో ఏ డైరెక్ట‌ర్ ట‌చ్ చేయ‌లేరు. ఆయ‌న క‌న్నా సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు పూరి జ‌గ‌న్నాథ్, త్రివిక్ర‌మ్, రాజ‌మౌళి సినిమాలు 100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించాయిగానీ… ఆ మార్కుకు చేరుకోవ‌డానికి వాళ్ల‌కు చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఎన్నో సినిమాలు చేస్తే గానీ ఆ ఫీట్ ను అందుకోలేక‌పోయారు. కానీ కొరటాల ఆ ఫీట్‌ను కెరీర్ ఆరంభంలోనే అందుకోవ‌డం విశేషం.

అంతా టాలీవుడ్ లో స్టార్ డైరెక్ట‌ర్ల జాబితాలో స్థానం సంపాదించార‌ని అంటున్నారు. కానీ అది అక్ష‌ర త‌ప్పు. టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్ కొర‌టాల అనే అనాలి. గ్యారేజ్ సినిమాలో సెన్సిటివ్ పాయింట్ ను ఎంత బ్యూటీఫుల్ గా చూపించాడు. ఆ క‌థ‌నే అద్భుతంగా క‌మ‌ర్శిలైజ్ చేసాడు. మ‌రో డైరెక్ట‌ర్ కైతే సాధ్యం కాని ప‌ని. మూడు సినిమాల‌కే టాలీవుడ్ ను ఏల్తున్నాడంటే.. ముందు ముందు ఎలాంటి కథ‌లతో సునామీ సృష్టించ‌నున్నాడో

Tags : , , , , , , ,