నాయకి రివ్యూ: ‘అసలు’ తక్కువ, ‘కొసరె’క్కువ

admin
nayaki

విడుదల తేదీ:15 జులై 2016
న్యూస్‌మార్గ్‌.కామ్‌ రేటింగ్‌:2.25/5
పంచ్‌లైన్:‘అసలు’ తక్కువ, ‘కొసరె’క్కువ

ఎవరెవరుప్లస్‌ పాయింట్స్‌మైనస్‌ పాయింట్స్‌ఫొటోలుట్రైలర్పబ్లిక్ టాక్

చిత్రం: నాయకి

జోనర్‌: (దయ్యం) కామెడీ థ్రిల్లర్

దర్శకత్వం: గోవి

నిర్మాతలు: గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి

కథ: రాజేందర్ కల్లూరి, హరీష్

నటీనట వర్గం: త్రిష, సత్యం రాజేష్, సుష్మా రాజ్, గణేష్ వెంకట్రామన్, వి జయప్రకాష్

పాటలు: రఘు కుంచె

స్క్రీన్‌ ప్లే: మూర్తి బి డి, రాజశేఖర్ యాదవ్, బృంద రవీంద్ర

సంగీతం: రఘు కుంచె

  • అంతంత మాత్రంగా అయినా మొదటి భాగంలో సత్యం రాజేష్ పండించిన హాస్యం
  • వాస్తవికంగాను, సందర్భానికి తగినట్టుగా ఉన్న సంభాషణలు
  • అందమైన దయ్యంగా త్రిషాను చూపించిన తీరు
  • గొప్పగా కనిపించే దృశ్య చిత్రీకరణ
  • కథలో ఎక్కువ విషయం లేకపోవడం
  • దయ్యమున్నా భయం ఎక్కడ కలగక పోవడం
  • కొంత సమయం తర్వాత రొటీన్ గా అనిపించే హాస్యం
  • వెంటనే జరిగిపోయే ప్రతీకార కథ
  • అర్థంతరంగా అయిపోయే దయ్యం కథ

కథాంశం: హైదరాబాద్ శివార్లలో అందమైన దయ్యం
nayaki movie stills7

శ్రీదేవి లాగా సినిమా హీరోయిన్ అవ్వాలనుకున్న అందమైన అమ్మాయి అనుకోని కారణాల దయ్యమై అమ్మాయిలపై అఘాయిత్యాలు చేయాలనుకునే మగరాయుళ్ల అంతు చూస్తుంటుంది.

ప్లాట్‌: దయ్యంకి సినిమా పిచ్చి దర్శకుడికి అమ్మాయి పిచ్చి

హీరోయిన్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండే దయ్యం ఉన్న మహల్లోకి, హర్రర్ సినిమాలు తీసే ఒక దర్శకుడు తన స్నేహితురాల్ని చెడు ఉదేశ్యంతో తీసుకు వస్తాడు.

కథ: దెబ్బకి దయ్యం ‘వదిలిస్తుంది’!

nayaki movie stills2హైదరాబాద్ శివార్లలో ఉండే దుండిగల్ లోకి 35 సంవత్సరాలుగా ఎవరూ వెళ్లరు, వెళ్లిన వాళ్ళు తిరిగి రారు. అందులో ఒక్క మహాలులో తప్ప ఇంకే ఇంటిలోనూ ఎవరూ ఉండరు కూడా. ఆ మహాలులో ఉండేది, ‘పదహారేళ్ళ వయసు’ సినిమాలో ‘సిరిమల్లెపువ్వు’ శ్రీదేవిలా ఉండే అందమైన ‘దెయ్యం’ గాయత్రి (త్రిష). కొన్ని పనులని సొంతంగాను, కొన్నింటిని మాయలతోను చేసుకుంటూ ప్రతీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకి మాత్రం టంచనుగా రెడీ అయి ఎవరికోసమో ఎదురుచూస్తూ కూర్చుంటుంది. కానీ ఇప్పటి వరకు ఆమె ఎదురుచూస్తున్న వ్యక్తి రారు.
ఇక హైదరాబాదుకి పోతే, బిల్డప్పులెక్కువ బిజినెస్ తక్కువ రేంజ్ హార్రర్ షార్ట్ ఫిల్ములు తీసే దర్శకుడు సంజయ్ (సత్యం రాజేష్) ఒక మోడ్రన్ అమ్మాయి శ్రావణి (పూనమ్ కౌర్) ని ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటూనే, సంధ్య (సుష్మా రాజ్) అనే ఇంకో అమ్మాయిని ప్రేమలోకి దించుతాడు. ఆ అమ్మాయి పుట్టినరోజుకి తనతో అన్ని పనులు ముగించేయాలనే ఉదేశ్యంతో తన స్నేహితుడు అరవింద్ (నారా రోహిత్) గెస్ట్ హౌస్ కి తీసుకేల్దామని బయలుదేరుతాడు.
సంజయ్ ఉదేశ్యం గమనించిన గాయత్రి దయ్యం తండ్రి ఆ జంటను వాళ్ళు వెళ్లాల్సిన గెస్ట్ హౌస్ కి కాకుండా గాయత్రి ఉండే మహలుకి పంపుతాడు. ఆ తర్వాత సంజయ్ కెమెరాలో మాత్రమే కనిపించే దయ్యం గాయత్రితో పడే పాట్లేమిటి, అసలు గాయత్రి కథేమిటి, తన తీరని కోరిక ఎలా తీరుతుంది అనేది మిగతా కథ.

ట్రీట్‌మెంట్‌: ‘అసలు’ తక్కువ, ‘కొసరె’క్కువ

సినిమాలో కథ కొంతే ఉన్నప్పటికీ హాస్యం పేరుతో దాన్ని సాగదీసి, అనవసరంగా పాటల్ని కూడా చొప్పించి ప్రేక్షకుడి సహనాన్ని కొంతవరకు పరీక్షిస్తుంది.

స్క్రీన్‌ ప్లే: కదలని కథనం

Brundha Ravindhraఒక్కసారి ప్రధాన పాత్రలు మహలు లోకి ప్రవేశించాక జరిగే సన్నివేశాలు కథని ముందుకు కదపకుండా పూర్తిగా హాస్యంపై ఆధారపడతాయి. వారానికి రెండు సార్లు ‘జబర్దస్త్’ చూడని ప్రేక్షకుడికి కూడా, కొంత సమయంలోనే ఆ హాస్యం రొటీన్ గా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ గతాన్ని వివరించిన తర్వాత ఇంకా ఏదో జరుగుతుందని ఆశించే ప్రేక్షకుడికి, అర్థాంతరంగా ముగిసిపోయే సినిమా నిరాశనే మిగులుస్తుంది.

హీరో (హీరోయిన్): సొగసైన దెయ్యం
Nayaki

దర్శకుడు గోవి ముందుగానే చెప్పినట్టుగా ఈ సినిమాకు ఖచ్చితంగా త్రిషానే హీరో. భయానక దయ్యంగా, సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసే పడుచు అమ్మాయిలా, ఆపైన సంప్రదాయ అలంకరణతో చీరలో, త్రిష మూడు రూపాల్లో కనిపిస్తుంది. కానీ సినిమాలో భయానికి పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో మిగతా రెండు పాత్రలే మెప్పించగలిగాయి.

హీరోయిన్స్‌: పరిధిలో నటన
Sushma-Raj-New-Stills-13

‘మాయ’ సినిమాలో ఉత్సాహంగా ఉంటూ చివరిలో ఉగ్రంగా మారే పాత్రకి మంచి మార్కులు కొట్టేసిన సుష్మ ఇందులో దానికి పూర్తిగా వ్యతిరేకమైన సౌమ్యంగా అమాయకంగా ఉండే సంధ్య పాత్రను, దయ్యంగా తాను చేయాల్సి వచ్చిన సన్నివేశాలతో సహా, తగినట్లుగా పోషించింది.

సినిమాటోగ్రఫీ: లోపం లేకుండా

పెద్దగా భయపెట్టేదేమీ లేకపోయినప్పటికీ, ‘కెమెరా’ దయ్యంగా త్రిషను చూపించడంలో, కథ ఎక్కువ భాగం జరిగే మహలుని రిచ్ గా చూపించడంలో సఫలమయ్యారనే చెప్పాలి.

ఇతర నటీ నటులు: సత్యం రాజేష్ – సోల్ పెరఫార్మన్స్

Satyam Rajesh

సినిమాలో త్రిష తర్వాత పూర్తి పాత్ర సహాయం రాజేష్ దే. తన డైలాగ్ డెలివరీ తో, హావభావాలతో బాగానే మొదటి సగం సగంవరకు లాక్కెళ్లినా, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలలో, మరొక హాస్య పాత్ర బాగానే నటించినా, ఆఖరి వరకు కూడా, ప్రయత్నించారు కానీ, పెద్దగా హాస్యం పండదు. గాయత్రి తండ్రిగా జయప్రకాష్ మెప్పించారు. గత కథలో గణేష్ నటించగా, చిట్టచివరిలో బ్రహ్మనందం, మొట్టమొదటిలో పూనమ్ కౌర్, నారా రోహిత్ తళుక్కున మెరుస్తారు.

సంగీతం: బ్యాక్ గ్రౌండ్స్ గుడ్

పాటలు అంతగా ప్రభావితం చేయవు, కానీ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్స్‌ బాగా ఉన్నప్పటికీ, కథలో వాటికి తగ్గ భయాన్ని సృష్టించలేదు.

కొసమెరుపు: కథ కొంచెం, వ్యథ జాస్తి

Tags : , , , , , ,