
విడుదల తేదీ:15 జులై 2016
న్యూస్‌మార్గ్.కామ్ రేటింగ్:2/5
పంచ్‌లైన్:సెల్ఫీ రాజా కాదు… సొల్లు రాజా





చిత్రం: సెల్ఫీ రాజా
జోనర్: కామెడీ
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: ఈశ్వర్ రెడ్డి
నిర్మాత: రామబ్రహ్మం చౌదరి
నటీనట వర్గం: అల్లరి నరేష్, కామ్నా రాణావత్, సాక్షి చౌదరి, సప్తగిరి, తాగుబోతు రమేష్, పృథ్వీ, నాగినీడు, రవిబాబు, కృష్ణభగవాన్
ఇటీవల కాలంలో అల్లరి నరేష్ నటించిన ప్రతీ సినిమా ఫెయిలే. సక్సెస్ కోసం ఎంత పోరాంటం చేసినా విజయం మాత్రం దరిదాపుల్లో కూడా కనిపించలేదు. కామెడీనే నమ్ముకుని ప్రయత్నాలు చేస్తోన్న ఈ హీరో కామెడీ పరమ రొటిన్ గా ఉండటటమే అందుకు ప్రధాన కారణం అని కామన్ ఆడియన్ నుంచి సైతం ఫీడ్ బ్యాక్ కూడా వస్తుంది. అయినా నమ్ముకున్న కామెడీ సిద్ధాంతాన్ని మాత్రం రాజా వదలడం లేదు. తాజాగా మరోసారి సెల్ఫీ రాజా అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ అల్లరోడు. మరి ఈసారైనా మూస కామెడీ పక్కనబెట్టి కొత్తగా ఏదైనా ప్రయత్నించాడో? లేదో? ఓ సారి చూద్దాం పదండి..
కథ
రాజా (నరేష్)కి సెల్ఫీలు తీసుకోవడం అంటే ప్రాణం. సమయం చిక్కినప్పుడల్లా సెల్ఫీలు కొట్టుకుంటూనే ఉంటాడు. ఆ పిచ్చి ఏ రేంజ్ లో ఉంటుందంటే శవాల దగ్గర కూడా సెల్ఫీ కొట్టే రకం. అదే సమయంలో రాజాకి నోటి దురుసు కూడా ఎక్కువే. ఈ రెండు కారణాలు రాజా కెరీర్ నే టర్న్ చేసేస్తాయి. అదే సమయంలో పోలీస్ కమీషనర్ కూతిరి శ్వేత (కామ్నా రాణవత్) ప్రేమలో పడతాడు. చివరికి ఎదోలో ఆమెను ముగ్గులోకి దించి పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తో శోభనం రోజు. శోభనం రోజును నూతన వధువరూలిద్దరు పెళ్లికి వచ్చి బహుమతులను చూసుకుంటుంటే అందులో రాజా వేరే అమ్మాయితో సెల్ఫీలు దిగిన ఫోటోలు బయటపడతాయి. దీంతో శోభనం రోజునే ఇద్దరి మధ్య గొడలు మొదలవుతాయి. దీంతో రాజా జీవితం మీద ఆశ సన్నగిల్లడంతో చనిపోవాలనుకుంటాడు. కొన్ని ప్రయత్నాలు కూడా చేసి విఫలం అవుతాడు. ఇక లాభం లేదనుకుని తనను చంపమని ఓ కాంట్రాక్టర్ కిల్లర్ కాకి (రవిబాబు) ను పురమాయిస్తాడు. కాకి అల్లుడు వరసయ్యే వ్యక్తి పోలికలు, రాజా పొలికలు ఒకేలా ఉండటంతో రాజాను చంపి అల్లుడు ఇన్సురెన్స్ చేజిక్కించుకోవాలని కాకి చూస్తాడు. అదే సమయంలో రాజాను చంపాలని మరో గ్యాంగ్ తిరుగుతుంటుంది. చివరికి రాజా చనిపోయాడా? శ్వేత మళ్లీ రాజాకు దగ్గరయిందా? రాజాను చంపాలని చూస్తోన్న గ్యాంగ్ ఎవరన్న విషయాలు తెలియాలంటే మిగతా భాగం తెరపైనే చూడాలి.
కథనం-విశ్లేషణ
ఇలాంటి జోనర్ కథలు తెలుగు తెరపై బొచ్చెడు మంది హీరోలు చేసేశారు. కథ పూర్తిగా పాత చింతకయా పచ్చడే. ట్రెండీగా ఉంటుందని సెలఫీరాజా అని టైటిల్ పెట్టారు గానీ దీనికి పర్ పెక్ట్ టైటిల్ సొల్లు రాజా అంటే సరిపోతుంది. దర్శకుడు కనీసం గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే కూడా మెయింటెన్ చేయలేకపోయాడు. ఈటీవీ జబర్ దస్త్ లో వచ్చే స్కిట్స్ కి వాట్స్ అఫ్ లో సర్క్యూలే ట్ అవుతోన్న జోక్స్ అంటించి రెండు, మూడు స్పూఫ్ లు తో సెల్ఫీరాజాను చూపించారు. కన్ఫూజన్ కామెడీ..యాక్షన్ కామెడీని మిక్స్ వేస్తే ఎలా ఉంటుందో సినిమా అలా సాగిపోతుంటుంది. క్యారెక్టర్లను ఇమిటేట్ చేయడం నరేష్ సినిమాల్లో కొత్తేమి కాదు.
ఆయన అరంగేట్రం సినిమా అల్లరి తప్ప మిగితా సినిమాలన్నింటీలోనూ దాదాపు ఏదో క్యారెక్టర్ తో పేరడీలు, స్పూఫ్ లను తూచ తప్పకుంటా టచ్ చేస్తూనే ఉన్నాడు. వాటి ఫీడ్ బ్యాక్ ను కూడా పట్టిచుకోకుండా నరేష్ సినిమా చేసినట్లు ఉంది. సినిమాలో చాలా కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాయి. మిగతా సినిమా దాదాపు తేలిపోయినట్లే. దర్శకుడు కథ, కథనాలపై ఆస్సలు శ్రద్ద చూపించలేదు. మంచి ప్యాడింగ్ ఆరస్టులున్నా ఉపయోగించుకోలేకపోయాడు. సినిమాకు సీనియర్ రైటర్లు పనిచేసినా వాళ్ల పనితనం మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఓవరాల్ గా చీఫ్ కామెడీని నరేష్ టీమ్ ట్రై చేసిందనొచ్చు.
నటీనటుల పనితీరు
నరేష్ ద్విపాత్రాభినం చేసినా ఏ క్యారెక్టర్ పండలేదు. బహుషా రొటిన్ కామెడీ లో కనిపించడం వలనే అలా జరిగిఉండవచ్చు. శారీరక శైలిలో నూ ఏ మాత్రం కొత్త దనం కనిపించలేదు. ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు కదా బాడీ లాంగ్వేజ్ ఛేంజ్ చేశారని అన్నారు కానీ అది మచ్చుకు కూడా ఎక్కడా కనిపించలేదు. ఇక హీరోయిన్లు పేరుకే ఉన్నారు. కామ్నా కొన్ని చోట్ల పర్వాలేదనిపించి దిగానీ, సాక్షి చౌదరి అయితే పేరుకే తెరపై కనిపించింది. గ్లామర్ తో అట్రాక్షన్ చేసే ప్రయత్నం చేశారు అవి ఫలించలేదు. థర్టీ ఇయర్స్ ఇండస్ర్టీ పృథ్వీ కామెడీ బాగానే పండింది. మిగిలిన నటీనటులు కామెడీ ప్రయత్నించారు పెద్దగా పండలేదు. సప్తగిరి, తాగుబోతు రమేష్ మూస పద్దతిలో కొట్టుకుపోయారు.
సాంకేతిక విభాగం పనితీరు
సాధారణంగా ఇలాంటి సినిమాలకు టెక్నికల్ టీమ్ తో పెద్దగా పని ఉండదు. సాయికార్తిక్ సంగీతం అందించిన పాటలు ఒకటి రెండు బాగానే ఉన్నాయి. మిగతావన్ని ఊకదంపుడే. కథ ఎలా ఉన్నా కొత్త ఏ మాత్రం ప్రయత్నించలేదు. లోక్ నాథ్ ఛాయాగ్రహణం కూడా షరా మామూలుగే నే ఉంది. శ్రీధర్ సీపాన, డైమండ్ రత్నం రాసిన మాటలకు అనుకరణ లా అనిపిస్తుంటాయి. దర్శకుడు ఈశ్వర్ రెడ్డి సిద్దు ఫ్రం శ్రీకాకకుళం మూవీ ప్లేవర్ నుంచి ఇంకా బయట పడలేదు. ట్రెండీగా ఉంటుందని సెల్ఫీరాజా అని టైటిల్ పెట్టారు తప్ప కథ, కథనాలు పూర్తిగా పాత చింతకాయ పచ్చడే.
చివరగా:సినిమా సెల్ఫీ రాజా కాదు…సొల్లురాజా
Tags : Allari Naresh, Movie Reviews, Selfie Raja Movie Review, Selfie Raja Movie Review & Rating, Selfie Raja Review