ఏపీలో రెండు జాతీయ పార్టీలు లగేజీ స‌ర్దుకోవాల్సిందేనా?

mohanrao
bjp-and-congress

ఏపీలో ప్ర‌త్యేకమైన రాజ‌కీయ ప‌రిస్థితులు క‌న్పిస్తున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న చేసిన కాంగ్రెస్‌, ఏపీకి ప్ర‌త్యేక హోదా హామీ ఇచ్చి మాట త‌ప్పిన‌ బీజేపీలు ఇప్పుడు ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను స‌విచూడాల్సి వ‌స్తోంది.

గ‌త ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ హ‌డావుడిగా ఏపీ విభ‌జ‌న‌కు పూనుకుంది. ఎటువంటి హేతుబ‌ద్ద‌త లేకుండా ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హారించింద‌నే విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకుంది. అంతే కాకుండా 5 కోట్ల ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప‌రిగ‌ణలోకి తీసుకోనందుకు ఆ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో త‌గిన శిక్ష అనుభ‌వించారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన నేత‌లు డిపాజిట్లు గ‌ల్లంతు అయ్యాయి. కాంగ్రెస్ చ‌రిత్ర‌లో ఏపీలో ఆ పార్టీకి ఇటువంటి ప‌రాభ‌వం ఎన్న‌డు ఎదురు కాలేదు. విభ‌జ‌న చేసిన కాంగ్రెస్ పార్టీ ఏపీకి కొన్ని హామీలిచ్చింది. నిజానికి ఆ హామీలు నెర‌వేరితే ఏపీకి మేలు జ‌రిగేవే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ముందు హ‌డావుడిగా విభ‌జ‌న‌కు పూనుకోవ‌డం, అనేక హామీలు ఇవ్వ‌టం జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప‌దేళ్ల‌లో క‌నీసం రెండు లేదా మూడు సంవ‌త్స‌రాల ముందే ఈ విధ‌మైన ప‌నికి పూనుకుని, ఏపీకి ఇవ్వాల్సిన రాయితీలు, హోదాలు అన్ని మొద‌లు పెట్టి ఎన్నిక‌ల‌కు వెళ్లి ఉంటే ప‌రిస్థితులు వేరే విధంగా ఉండేవ‌ని చెప్ప‌టం ఆతియోశ‌క్తి కాదు. కానీ కాంగ్రెస్ చివ‌రి నిమిషంలో ఇటువంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, హామీలు అమ‌లు చేసే బాధ్య‌త‌ను ఎన్నిక‌ల్లో గెలిచే పార్టీకి అప్ప‌గించ‌డంతో ఇప్పుడు ప‌రిస్థితి మొద‌ట‌కి వ‌చ్చింది. ప్ర‌త్యేక హోదా కోసం ఆ పార్టీ పార్ల‌మెంట్‌లోనూ, బ‌య‌ట పోరాడుతూ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల నుంచి ఆధ‌ర‌ణ దొర‌కుతుంద‌నే గ్యారంటీ లేదు. ప్ర‌జ‌ల కోపం ఇంకా త‌గ్గ‌లేదంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన బీజేపీ ఏపీకి ఇచ్చిన వాగ్దానాల‌ను ప‌క్క‌న పెట్టింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పి ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌తో పెట్టింది. బ‌హిరంగ స‌భ‌ల్లో స్ప‌ష్టంగా ప్ర‌క‌టించింది. ఇప్పుడు మాత్రం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ని చెప్పుతోంది. దీంతో ఆ పార్టీపై ఏపీలో ప్ర‌జ‌లు భ‌గ్గుమంటున్నారు. ఏపీ పున‌ర్ విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి కేంద్రం అనేక రాయితీలు, స్పెష‌ల్ ఫండ్‌, రాజ‌ధాని నిర్మాణం, రెవెన్యూ లోటు వంటి అనేక అంశాల్లో కేంద్రం ఏపీకి సాయం చేయాల్సి ఉంది. కానీ ఏపీ పున‌ర్ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర ప్ర‌భుత్వం సాయం చేస్తే బీజేపీకి రాజ‌కీయంగా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. కాంగ్రెస్ చేసిన చ‌ట్టం ప్ర‌కార‌మే చేశారు క‌దా? అనే వాద‌న‌కు తెర లేస్తోంది. కాబ‌ట్టి బీజేపీ నీతిఆయోగ్ పేరిట‌. ప్ర‌ణాళిక సంఘం పేరుల‌ను అడ్డుకుని ఏపీ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా నిరంత‌ర సాయం, ప్ర‌త్యేక సాయం పేరుతో కొన్ని ప్ర‌క‌టించింది. ఈవ‌న్నీ పున‌ర్ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న వాటికి కొంత కోత విధిస్తూ ఇవే పెద్ద సాయం కింద బిల్డ‌ప్ ఇవ్వ‌డానికి పూనుకుంది.

అస‌లే ఏపీ విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయామ‌ని భావిస్తున్న ఏపీ ప్ర‌జ‌ల‌కు బీజేపీ వైఖ‌రి పుండిమీద కారం చ‌ల్లిన విధంగా ఉంది. విభ‌జ‌న‌తో జ‌రిగిన న‌ష్టాన్ని ప్ర‌త్యేక హోదాతో పూడ్చుతార‌ని న‌మ్మితే ఇలా గొంతు కోస్తారా? అంటూ ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. ఏపీకి ఇచ్చిన మాట త‌ప్పిన బీజేపీతో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారాన్ని పంచుకుంటున్న టీడీపీ కూడా ఇప్పుడు సెగ‌ను భ‌రించ‌క‌త‌ప్ప‌టం లేదు. టీడీపీ పై కూడా ఒత్తిడి పెరుగుతుంది. బీజేపీ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి . ఇప్పుడు టీడీపీ కూడా ఇర‌కాటంలో ప‌డింది. అంతే కాకుండా ప్ర‌త్యేక హోదాకు ప్ర‌త్యామ్నాయంగా ప్యాకేజీ ప్ర‌క‌టిస్తే ఎలా అంగీక‌రిస్తారంటూ టీడీపీని నిల‌దీస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు రాష్ట్రంలో అధికారాన్ని ఆ పార్టీతో పంచుకుంటున్న టీడీపీ ఈ ప‌రిణామాలు ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మిస్తున్నాయి. ప్ర‌స్తుతం చోటు చేసుకున్న ప‌రిణ‌మాలు మాత్రం ఏపీలో కాంగ్రెస్‌, బీజేపీల‌ను ప్ర‌జ‌లు దోషుల‌కు చూసే ప‌రిణామాలు త‌లెత్తాయి.

Tags : , , , , , ,