అమరావతి ఇమేజ్ కారణం చంద్రబాబే

mohanrao
ayyanna

ఏపీ చంద్ర‌బాబు కి రాజ‌కీయాల్లో మంచి ప‌ట్టుంది. దేశ‌, విదేశాల్లోనూ మంచి ఇమేజ్ ఉంది. దాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. ఈ విష‌యాన్ని మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు మ‌రోసారి గుర్తు చేశారు.

ఆంద్రప్రదేశ్ కు,అమరావతికి ఒక ఇమేజీ వచ్చిందంట అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమేజీ వల్లేనని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. కర్నూలులో జరిగిన యువభేరీలో విపక్ష నేత జగన్ ప్రసంగంపై ఆయన స్పందించారు.జగన్ అబద్దాలు చెబుతున్నారని, చంద్రబాబు విదేశీయాత్రల వల్ల ఏమి వచ్చిందని అడుగుతున్నారని, ఆయన వల్లే అమరావతికి ఇమేజీ వచ్చిందని అయ్యన్నపాత్రుడు అన్నారు.

అమరావతి శంకుస్థాపనకు సింగపూర్ ,జపాన్,చైనా మంత్రులు హాజరయ్యారంటే అది చంద్రబాబు వల్లేనని ఆయన అన్నారు.రష్యా మంత్రి వచ్చి ఒప్పందం చేసుకున్నారంటే చంద్రబాబు విదేశీ పర్యటనల వల్లేనని మంత్రి వ్యాఖ్యానించారు.శ్రీ సిటీ రెండో టోక్యోలా ఉందంటే చంద్రబాబు వల్లేనని అయ్యన్నపాత్రుడు అన్నారు.
ఇటువ‌ల వైఎస్ జ‌గ‌న్ యువ‌భేరిలు నిర్వ‌హిస్తూ ఏపీ ప్ర‌భుత్వంపైనా, చంద్ర‌బాబుపైనా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వాద‌న‌ను మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు విదేశి ప‌ర్య‌ట‌న వ‌ల్ల‌నే అమ‌రావ‌తికి ఆ ఇమేజ్ వ‌చ్చింద‌ని ఆయ‌న బ‌ల్ల‌గుద్దారు.

Tags : , , , , , , , , ,