అరెస్ట్ చేస్తే కాపు ఉద్య‌మంలో ప్ర‌త్య‌క్షంగానే..!! భూమ‌న‌

Surendra
bhumana

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమ‌న క‌రుణాక‌ర్ మ‌రోసారి తుని ఘ‌ట‌న‌లో భాగంగా మంగ‌ళ‌వారం సీఐడీ విచార‌ణ‌కు హ‌జ‌రైన సంద‌ర్భంగా చంద్ర‌బాబు పై నిప్పులు చెరిగారు.

బాబు వెన్న‌పోటు పొడ‌వ‌డం వెన్న‌తో పెట్టిన విద్యాలాంటింది. కుట్ర‌లు, కుతంత్రాలు వంటి నీచ‌పు ప‌నులు త‌ప్ప ఆయ‌న‌కు మ‌రొక‌టి తెలియ‌దు. ఆయ‌న మ‌న సీఏం అవ్వ‌డం మ‌న దురృష్టం. ఆయ‌న ప‌రిపాలించే విధానం చూస్తూంటే పాల‌న‌లా లేదు బ‌కాసురిడి ప‌రిపాల‌న‌లా ఉంది. మాకు సంబంధం లేని కేసుల‌ను బ‌నాయించి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికి ఇలా కుంటి సాకులు చెప్పి నాట‌కాలు ఆడుతున్నారు. తుని ఘ‌ట‌న‌లో సంబంధం లేక‌పోయినా న‌న్ను ఇరికించాల‌ని చూస్తున్నారు.

ఒక‌వేళ అదే గ‌నుక జ‌రిగితే కాపు ఉద్య‌మంలో ప్ర‌త్య‌క్షంగా పాల్గొంటాను. ఇప్ప‌టివ‌ర‌కూ కాపుల‌కు స‌పోర్ట్ గా నిల‌బ‌డ్డాను అంతే. నేనే గ‌నుక సీన్ లోకి ఎంట‌ర్ అయితే ఎలా ఉంటుందో బాబుకు అప్పుడు తెలుస్తుంది. ముద్ర‌గ‌డ పోరాటానికి వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్ మ‌ద్ద‌తునిచ్చినందుకే బాబు భ‌రించ‌లేక ఇలాంటి చేత‌గాని ప‌నులు చేయిస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Tags : , , , , , , ,