బిర్యానీ, వంద రూపాయ‌ల‌కు 42 బ‌స్సులు ద‌గ్దం చేసిన యువ‌తి

mohanrao
bus

కావేరి జ‌లాల వినియోగంపై క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డిన వివాదంలో చోటు చేసుకున్న విధ్వంసంలో మ‌రో ట్విస్ట్‌.

బిర్యానీ, వంద రూపాయ‌ల కోసం అమ్మాయి 42 బ‌స్సులు ద‌గ్దం చేసింది. క‌ర్నాట‌క రాష్ట్రంలోని బెంగ‌ళూరు న‌గ‌రంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.రెండు రాష్ట్రాల మ‌ధ్య రాజుకున్న కావేరి జ‌ల‌వివాదంపై నిర‌స‌న‌గా సెప్టెంబ‌రు 12వ తేదీన త‌మిళ‌నాడు ట్రాన్స్‌పోర్ట్ ఆప‌రేట‌ర్ కు చెందిన 42 మ‌స్సుల‌ను ద‌హ‌నం చేశారు. బెంగ‌ళూరుకు చెదిన సి. భాగ్య అనే 22 ఏళ్ల యువ‌తి కేవ‌లం ప్లేటు మ‌న్ బిర్యానీ. వంద రూపాయ‌ల న‌గ‌దు కోస‌మే రంగంలోకి దిగి 42 బ‌స్సులను ద‌హ‌నం చేసింద‌ని సీపీ టీవీ పుటేజ్ సాయంతో పోలీసులు నిర్దారించారు. నిందితురాలైన భాగ్య కేపీఎస్ గ్యారేజీ స‌మీపంలో గిరిన‌గ‌ర్‌లో త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి జీవిస్తుంద‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. రోజూ వారీ కూలీ అయిన భాగ్య ప‌నికెళ్లి మ‌ధ్యాహ్నం ఇంటికి తిరిగి వ‌చ్చింద‌ని పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. కావేరి జ‌ల వివాదంపై చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొంటే బిర్యానీతో పాటు వంద రూపాయ‌లు కూడా ఇస్తార‌ని భాగ్య వెళ్లింద‌ని ఆమె త‌ల్లి ఎల్ల‌మ్మ మీడియాకు చెప్ఆప‌రు. భాగ్య‌తో పాటు మ‌రో 11 మందిని పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. బ‌స్సుల ద‌హ‌నం, నిర‌స‌న ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో నిందితులైన 400 మందిని అరెస్టు చేసినా, బ‌స్సుల ద‌హ‌నం కేసులో భాగ్య ప్ర‌మేయం ఉంద‌ని త‌మ ద‌ర్యాప్తులో తేలింద‌ని పోలీసులు చెబ‌తున్నారు.

Tags : , , , , , ,