పోల‌వ‌రం, ప‌ట్టిసీమ నీటి వ్య‌వ‌హారంతో మాకు సంబంధంలేదు

mohanrao
pattisima

ఉభయ తెలుగు రాష్ట్రాల లో ఎకె బజాజ్ కమిటీ మూడు రోజుల పర్యటన ముగి సింది.

పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో గోదావరి నుంచి కృష్ణా నదికి మళ్లిస్తున్న నీటి వాటాను రెండు రాష్ట్రాల మధ్య తేల్చడం తమ పరిధిలోని వ్యవ హారం కాదని బజాజ్ కమిటీ స్పష్టం చేసింది. పట్టిసీ మ, పోలవరం అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయని, నీటి కేటాయింపులు ట్రిబ్యునళ్ల పరిధిలో ఉన్నాయన్నా రు. కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు వస్తే ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలపై తాత్కాలిక ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్, నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావులను తాము కలిసామని, చురుకైన నేతలని ప్రశంసించారు. అయితే నదుల్లో నీటి కొరత లేదని, కరవు సమయాల్లో, లోటు వర్షపాతం ఉన్నప్పుడే ఇరు రాష్ట్రాలు, ఎగువ రాష్ట్రాలతో సమస్యని కెసిఆర్ విశ్లేషించారని బజాజ్ చెప్పారు. వచ్చే నెలలో మళ్ళీ ప్రాజెక్టులను సందర్శిస్తామని స్పష్టం చేశారు. నీటి కేటాయింపులపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి, నిర్ణయిస్తామని అన్నారు.

సోమవారం తెలంగాణ వాదనలు, అభిప్రాయా లు విన్న కమిటీ మంగళవారం విజయవాడలో ఎపి వాద నలు విన్నది. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ముగింపు సమావేశం జరిపారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన బజాజ్ సారధ్యంలోని నిపుణుల కమిటీ విధివిధానాలలో ఈ అంశం ఉందని టిఎస్ ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు గుర్తుచేశారు. ఆయనతో పాటు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ డా.ఎస్.కె. జోషి తెలంగా ణకు జరుగుతున్న అన్యాయాన్ని మరోసారి క్లుప్తంగా వివరించారు. రెండు రాష్ట్రాల పర్యటనలో ఇద్దరు ముఖ్య మంత్రులు, అధికారులను కలిసామని, సమస్యలు పరి ష్కరించుకోవడంపై ఇరు వైపులా సానుకూల దోరణి కనిపిస్తోందని ఎకె బజాజ్ అభిప్రాయపడ్డారు. దీంతో చర్చల ద్వారానే పరిష్కరించుకోవచ్చని అన్నారు.

Tags : , , , , , , , ,