పార్టీ విధి, విధానాల‌పై ప‌వ‌న్ పుస్త‌కం

mohanrao
pawan

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో పుస్తకాన్ని విడుదల చేయడానికి సిద్దపడుతున్నారు. గతంలో పవనిజం పుస్తకాన్ని విడుదల చేసిన విషయం తెల్సిందే. పార్టీ విధి, విధానాలు, పార్టీ ఉద్దేశాన్నిప్రజలకు వివరిస్తారట.

ప‌న‌వ్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ స్ధాపించి మూడేళ్లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న పార్టీ సిద్దాంతాలు, విధి, విధానాలు ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌లేక‌పోయారు. ఆయ‌న మూడేళ్ల‌లో బ‌హిరంగంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కేటాయించిన టైమ్ నామ‌మాత్ర‌మేన‌ని చెప్ప‌క‌ త‌ప్ప‌దు.

ఇటీవ‌ల తిరుప‌తి, కాకినాడ‌ల్లో పార్టీ నేతృత్వంలో బ‌హిరంగ‌స‌భ‌లు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ ఈ స‌భ‌ల్లో కూడా పెద్ద‌గా పార్టీ విధానాలను ప్రజలకు తెలియపర్చింది ఏమీ లేదు. అంతేకాకుండా తిరుపతితో ప్రత్యేక హోదా కోసం పోరాడుదాం, పోరాడుదాం, జీవితాంతం పోరాడుదాం అని నినాదాలు చేసిన పవన్ కాకినాడలో దీనికి పూర్తి భిన్నంమైన వైఖరి ప్రదర్శించారు.

దాంతో పవన్ అభిమానులు గందరగోళానికి గురి అయ్యారు. ప్రజలకు ఎటువంటి సందేశాన్ని కూడా పవన్ ఇవ్వలేకపోయారు. అంతే కాకుండా ఆతర్వాత రెండు ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వూలో కూడా స్పష్టమైన వైఖరి ప్రదర్శించలేకపోయారు. దాంతో అనేక ప్రశ్నలు తలెత్తాయి. వీటికి సమాధానంతో పాటు ప్రజలకు పార్టీని ఎందుకు స్ధాపించాల్సి వచ్చింది. దానికి ప్రేరేపించిన కారణాలు ఏమిటి? పుస్తకానికి ‘మార్పు కోసం యుద్ధం’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అనే విష‌యాల‌పై ఆయ‌న పుస్త‌కాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ మేర‌కు జ‌న‌సేన పేరుతో మంగ‌ళ‌వారం మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Tags : , , , , ,