ఖైదీ నెంబ‌రు 9234 జైల్లో శ‌శిక‌ళ‌

mohanrao
sasikala

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించిన అన్నాడిఎంకె అధినేత్రి వికె శశికళ నట రాజన్ బెంగళూరు కోర్టులో లొంగిపోయారు.

బుధవారం సాయం త్రం ఇక్కడికి సమీపంలోని పరప్పణ అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. బెంగ ళూరు కోర్టులో హాజరవ్వాల్సి ఉండగా పోలీస్ కమిషనర్ చేసిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు న్యాయస్థానాన్ని జైలులోనే ఏర్పాటు చేశారు. శశికళతో పాటు ఈ కేసులో దోషులుగా తేలిన సుధాకరన్, ఇళ వరసి కూడా కోర్టులో లొంగిపోయారు. కోర్టులో వీరి వాంగ్మూ లాలను నమోదు చేసిన అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు వారికి వైద్య పరీక్షలు చేయించి పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. జైలు అధికారులు ఖైదీలుగా శశికళకు 9234, ఇళవరసికి 9235, సుధాకరన్‌కు 9236 నంబర్లు కేటాయించారు. శశికళను సాధారణ ఖైదీగానే పరిగణించాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని శశికళ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

శశికళ, ఇళవరసిలకు ఒకే బ్యారక్‌లోని గదులు కేటాయించారు. శశికళ విజ్ఞప్తి మేరకు అగరవత్తులు, క్యాండిల్స్ తయారీ పని అప్పగించారు. దీని ద్వారా ఆమెకు రోజుకు రూ.50 భత్యంగా ఇస్తారు. ముగ్గురు ఖైదీలు ఉండే సెల్‌లోనే శశికళను ఉంచనున్నారు. జైలు నిబంధనల ప్రకారం ఉదయం 6.30 గంటలకు అల్పాహారం, 11.30గంటలకు భోజనం, సాయంత్రం 4గంటలకు టీ, రాత్రి 7గంటలకు భోజనం అందిస్తారు. శశికళ ప్రత్యేక దుస్తులు ధరించేందుకు జైలు అధికారులు నిరాకరించారు. దీంతో ఆమె జైలు దుస్తులనే ధరించారు. ఈ కేసుకు సంబంధించి గతంలోనే శశికళ 6నెలలు జైలుశిక్ష అనుభవించారు. మరో మూడున్నరేళ్లు శశికళ సాధారణ ఖైదీగా పరప్పణ అగ్రహారం జైల్లోనే శిక్ష అనుభవించాల్సి ఉంది. శశికళ భర్త నటరాజన్, లోక్‌సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై, శశికళ మద్దతుదారులు, అనుచరులు పరప్పణ జైలు వద్దకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పరప్పణ అగ్రహారం జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అన్నా డీఎంకే కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Tags : , , , ,