గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర‌రావు నాన్చుడు వెనుక మ‌త‌లాబేమిటి?

mohanrao
vidya

దక్షిణాది రాష్ట్రాల్లో పాగ వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ అడ్డ‌దారులు వెతుక్కుంటుందా? త‌మిళ‌నాడులో బీజేపీ వైఖ‌రిపై ఇటువంటి అనుమానాలే వెల్లువెత్తుతున్నాయి.

త‌మిళ‌నాడులో రాజ‌కీయ సంక్షోభానికి బీజేపీ వైఖ‌రే కార‌ణ‌మ‌ని అనేక మంది అరోప‌ణ‌లు చేస్తున్నారు. కార‌ణం ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ మాజీ కేంద్ర మంత్రి సీ. విద్యాసాగ‌ర‌ర‌వు అవ‌లంభిస్తున్న వైఖ‌రి. ఎఐడీఎంకే ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉన్న ప‌ళ‌నిస్వామి బ‌ల‌నిరూప‌ణ‌కు అవ‌కాశం ఇవ్వ‌టం లేదు. ఎందుకో కార‌ణం తెలియ చేయ‌టం లేదు. మ‌రో ప‌క్క‌ బీజేపీ చేతిలో పావుగా మారార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప‌న్నీర్ సెల్వంకి బ‌లం లేక‌పోయినా ఆయ‌న పుంజుకోవ‌డానికి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు విన్పిస్తున్నాయి. ప‌ది రోజులు గ‌డుస్తున్న ప‌న్నీర్ సెల్వం బ‌లం ప‌ది దాటడం లేదు. ఆయ‌న్ని బ‌ల‌వంతంగా బ‌రి నిలిపి గంద‌ర‌గోళం సృష్టించ‌టంతో స‌క్స్‌స్ అయ్యారు. దానికి అనుకూల మీడియాకూ త‌న వంతు పాత్ర పోషింద‌ని చెప్ప‌క త‌ప్పందు.

తమిళనాడు ముఖ్యమంత్రిపై గత కొంత కాలంగా నెలకొన్న ఉత్కంఠ కు గ‌వ‌ర్న‌ర్ ఇప్ప‌టికైనా ముగింపు ప‌లుకుతారా లేదా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.. రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమంత్రి ఎంపిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు చేతిలో ఉంది.. రాష్ట్ర భవిష్యత్ కు నష్టం కలగని రీతిలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. దీంతో ఆయన ఏం చెబుతారా? అన్న ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

Tags : , , , , , , , ,