
నటి అనిత భర్త, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పిల్లలు కలగాలనే శ్రీకాళహస్తి దేవాలయంలో రాహుకేతుకు ప్రత్యేక పూజలు చేశారు
శ్రీకాళహస్తి దేవాలయంలో రాహుకేతు పూజలకు చాలా ప్రత్యేకత ఉంది. దంపతులు ఇద్దరు వెళ్లి అక్కడ స్వయంగా పూజలు చేస్తే ఆయురారోగ్యాలతో పాటు పిల్లలు కూడా త్వరగా కలుగాతారని బలమైన నమ్మకం. ఆ మధ్య రామ్ చరణ్- ఉపాసన దంపతులు కూడా రాహుకేతు పూజలు చేయించుకున్నారు. తాజాగా నటి అనిత భర్త, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతంర ఆమె మీడియాతో మాట్లాడారు.
పిల్లలు కలగాలంటే ఈ దేవాలయం ప్రసిద్ది అని విన్నా. నా స్నేహితుల సలహా మేరకు ఇక్కడకు వచ్చా. పూజలు, ప్రదక్షణలు బాగా జరిగాయి. గుడి ముఖద్వారం ఆకర్షణీయంగా ఉంది… అంటూ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. అలాగే ఆమె నటిస్తోన్న `మనలో ఒకడు` సినిమా హిట్ చేయాలని ప్రేక్షకులను కొరుకున్నారు. కొన్ని చిన్న సినిమా అవకాశాలు వస్తున్నాయి. అలాగే టెలివిజన్ షోస్ చేయమని ఆర్గనైజర్స్ అడుగుతున్నారు. వాటి గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికైతే ఎక్కువ సమయాన్ని కుటుంబానికే కేటాయించాలనుకుంటున్నాని తెలిపారు.
Tags : Actress Anita and her husband, Srikalahasti temple, worshiping rahuketu, నటి అనిత, భర్త, రాహుకేతు పూజలు, శ్రీకాళహస్తి దేవాలయం