హిల్ల‌రీపై కొన‌సాగుతున్న ట్రంప్ విమ‌ర్శ‌ల దాడి

mohanrao
trump

అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డుతున్న ట్రంప్ ప్ర‌త్య‌ర్ధి హిల్ల‌రీపై మ‌రోసారి దాడి చేశారు. ఆయ‌న హిల్ల‌రీపై అనేక విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెల్సిదే.

అమెరికా అధ్య‌క్ష ఎన్నికల్లో డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తున్న హిల్ల‌రీ క్లింట‌న్‌పై రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్ధి డోనాల్డ్ ట్రంప్ తీవ్ర మైన విమ‌ర్శ‌లు చేశారు. సిరియాకు సంబంధించి హిల్ల‌రీ పాల‌సీ కార‌ణంగా మూడో ప్ర‌పంచ యుద్దం వ‌స్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అణ్వాయుధ సంపత్తి ఉన్న రష్యా దళాలతో ఘర్షణ జరిగే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ఈ మేరకు ఓ చానల్‌కు ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికంగా విదేశీ పాలసీలపైనే దృష్టి పెట్టారని, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌ను పదవి నుంచి దించడం కంటే ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించడమే ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో విభేదాల అనంతరం హిల్లరీ ఏ విధంగా అతనితో సంధి చేసుకోగలరని ట్రంప్ ప్రశ్నించారు. రిపబ్లికన్ పార్టీ ఐక్యమత్యంగా ఉంటే ఈ ఎన్నికల్లో ఓడిపోమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిరియా యుద్ధం అంశంలో సమస్యను పరిష్కరించడానికి బదులుగా హిల్లరీ అమెరికాను ఇందులోకి లాగి సమస్యను మరింత క్లిష్టం చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. నవంబరు 8న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సర్వేల ప్రకారం హిల్లరీ క్లింటన్ ఆధిక్యంలో ఉన్నారు.

Tags : , , , , ,