ఒలింపిక్స్‌ ఫైనల్‌కు చేరిన భారత జిమ్నాస్ట్‌ దీపాకర్మాకర్‌

Surendra
dipakar

రియో ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ ఫైనల్‌కు చేరింది

రియో ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ అంచనాలు అందుకుంటోంది. ఆర్టిస్టిక్స్‌ జిమ్నాస్టిక్స్‌లో ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళ జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. రియో ఒలింపిక్స్‌లో యువ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ పతకం ఆశలు రేపుతోంది. ఆర్టిస్టిక్స్‌ జిమ్నాస్టిక్స్‌ బరిలో దిగిన దీపా క్వాలిఫికేషన్ రౌండ్‌లో సత్తా చాటింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ త్రిపుర జిమ్నాస్ట్‌ భారత్‌ పతక ఆశల సౌధాన్ని మోస్తూ మెరుగైన ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. వార్మప్‌ నుంచి దీప విన్యాసాలను ఓ సారి పరిశీలిస్తే..!
dipa1

dipa2
క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో తొలి 8 స్థానాల్లో నిలిచినవారే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. అయితే నమ్మకంగా బరిలోకి దిగిన దీపా ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. 8వ స్థానంలో నిలిచి టైటిల్‌ రేస్‌కు అర్హత సాధించింది. 14న జరిగే ఫైనల్‌లో దీపా భారీ అంచనాల మధ్య బరిలో దిగనుంది.
dipa3

dipa4

Tags : , , , , , , ,