ఇండియా క్రికెట్ మ్యాచ్ కు ‘హాకీ టీమ్’.

admin
indian-hockey-team

భార‌త్-బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్ ను తిల‌కించేందుకు హాకీ జ‌ట్టును బీసీసీఐ ఆహ్వానించింది.

టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా భార‌త్-బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ ను తిల‌కించేందుకు భార‌త హాకీ జ‌ట్టుకు బీసీసీఐ ఆహ్వానం పంపింది. దీనిలో భాగంగా హాకీ టీమ్ కు విఐపీ టిక్కెట్ల‌తో పాటు, ర‌వాణా సౌక‌ర్యాల‌ను కూడా బీ.సి.సి.ఐ క‌ల్పించింది. అయితే ఇత‌ర క్రీడ‌ల‌ను చూసేందుకు ఇలా అనుమ‌తించ‌డం అనేది ఇదే మొద‌టిసారి. అయితే ఈ టీమ్ మొత్తం బెంగుళూర్ లో జ‌ర‌గ‌నున్న సుల్తాన్ అజ్లాన్ షా ట్రోపీ కోసం పాల్గొంది.

ఈ సంద‌ర్భంగా భార‌త హాకీ జ‌ట్టు సార‌థి స‌ర్దార్ సింగ్ బీసీసీఐ కార్య‌ద‌ర్శి అనురాగ్ ఠాకూర్ నుంచి ఆహ్వానం రావ‌డం ఆనందంగా ఉంది. ఇది మంచి శుభ‌ప‌రిణామం. మా హాకీ టీమ్ అంతా స్టాండ్స్ నుంచి మ‌న జ‌ట్టును ఉత్సాహ‌ప‌రుస్తాం. మేం బెంగుళూరులో ఉన్నామ‌ని తెలుసుకుని ఆహ్వానం పంపినందుకు బీ.సీ.సీ.ఐ కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాం. గ‌తంలో ఢిల్లీలో భార‌త్- చెక్ రిప‌బ్లిక్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన డేవిస్ క‌ప్ మ్యాచ్ కు కూడా హాకీ టీమ్ హ‌జ‌రైంది.

Tags : , , , , , , , , ,