న్యూజిలాండ్- భార‌త్ మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే

admin
New Zealand's

మంగ‌ళ‌వారం బీసీసీ న్యూజిలాండ్-భార‌త్ ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్ షెడ్యూల్ ను విడుద‌ల చేసింది

న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్టు భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను మంగ‌ళ‌వారం బీసీసీ వెల్ల‌డించింది. న్యూజిలాండ్ భార‌త్ తో మూడు టెస్టులు, ఐదు వ‌న్డేలు ఆడ‌నుంది. సెప్టెంబ‌ర్ 22 న మొద‌టి టెస్ట్ కాన్పూర్ లో, సెప్టెంబ‌ర్ 30 ఇండోర్ లో రెండ‌వ టెస్ట్, మూడ‌వ టెస్ట్ ఆక్టోబ‌ర్ 8 నుంచి 12వ తేదీ వ‌ర‌కూ కోల్ క‌తా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జ‌ర‌గ‌నుంది. వ‌న్డేల వివ‌రాలు.. అక్టోబ‌ర్ 16 ధ‌ర్మ‌శాల‌లో మొద‌టి మ్యాచ్, అక్టోబ‌ర్ 19న ఢిల్లీ పిరోజ్ షా కోట్ల మైదానంలో రెండ‌వ వ‌న్డే, అక్టోబ‌ర్ 23న మొహాలీలో మూడ‌వ వ‌న్డే, అక్టోబ‌ర్ 26 రాంచీలో నాల్గ‌వ మ్యాచ్, ఇక చివ‌రి వ‌న్డే మ్యాచ్ అక్టోబ‌ర్ 29 విశాఖప‌ట్ణ‌ణంలో జ‌ర‌గ‌నుంది.

Tags : , , , , , , , ,