టెస్టుల్లో కొహ్లీ తొలి డ‌బుల్ సెంచ‌రీ న‌మోదు

admin
kohli

అంటెగ్వా వేదిక‌గా భార‌త్ – వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతోన్న టెస్టు మ్యాచ్ లో భార‌త్ భారీ స్కోరు దిశ‌గా ప‌రుగులు తీస్తోంది. కోహ్లీ తొలిసారి టెస్టుల్లో డ‌బుల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు

అంటెగ్వా వేదిక‌గా భార‌త్ – వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతోన్న టెస్టు మ్యాచ్ లో భార‌త్ భారీ స్కోరు దిశ‌గా ప‌రుగులు తీస్తోంది. రెండవ రోజు లంచ్ స‌మ‌యానికి భార‌త్ ఏడు వికెట్లు కోల్పోయి 404 ప‌రుగులు చేసింది. సూప‌ర్ ఫాస్ట్ ప్లేయ‌ర్ విరాట్ కొహ్లీ దూకుడు జోరుగా కొన‌సాగుతోంది. 281 బంతుల్లో 200 ప‌రుగులు చేసి టెస్టుల్లో తొలి డ‌బుల్ సెంచ‌రి సాధించి రికార్డుకెక్కాడు. టీమ్ ఇండియా కెప్టెన్ గా ఉంటూ డ‌బుల్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా కూడా కోహ్లీ కీర్తిని గ‌డించాడు. దీంతో కోహ్లీ త్రిబుల్ సెంచ‌రీ చేయాల‌ని అభిమానులు లంచ్ స‌మ‌యంలో నినాదాలు చేశారు. అటు కోహ్లీకి తోడుగా క్రీజ్ లో ఉన్న ర‌విచంద్ర‌న్ అశ్వ‌న్ (63) ప‌రుగుల‌తో రాణించాడు. వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో బిషూ మూడు వికెట్లు, గాబ్రియ‌ల్ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

Tags : , , , , , , ,