ర‌విశాస్ర్తి అందుకే ఛాన్స్ వ‌దులుకున్నాడు…దాదా

admin
ravi-shastri-and-sourav-gan-1466866893_converted

టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ గా ర‌విశాస్ర్తిని ఎంపిక చేశామ‌ని కానీ అందుకు ఆయ‌న నిరాక‌రించార‌ని దాదా మీడియా స‌మావేశంలో తెలిపాడు

మాజీ క్రికెట‌ర్లు సౌర‌వ్ గంగూలీ, ర‌విశాస్ర్తిల మ‌ధ్య ఇటీవ‌ల జ‌రిగిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఇరువురు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్ కు బీసీసీఐ పెద్ద షాక్ తింది. అయితే తాజాగా దాదా ర‌విశాస్ర్తికి అవ‌కాశం ఇచ్చినా ఉప‌యోగించుకోలేక‌పోయాడ‌ని వ్యాఖ్యానించారు. టీమ్ ఇండియా ప్ర‌ధాన కోచ్ గా అనీల్ కుంబ్లే ను ఎంపిక చేసిన‌ప్ప‌టికీ, ర‌విశాస్ర్తిని బ్యాటింగ్ కోచ్ గా ఉండ‌మ‌ని కోర‌మ‌ని అయినా అందుకు నిరాక‌రించ‌డాని దాదా తెలిపాడు. ఇండియాకు హెడ్ కోచ్ గా ఉండాల‌ని ర‌విశాస్ర్తి అనుకున్నార‌ని కానీ ఆయ‌న‌క‌న్నా జూనియ‌ర్ అయిన కుంబ్లేను ప్ర‌ధాన కోచ్ చేయ‌డం ఆయ‌న‌కు ఇష్టం లేక‌నే వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకున్నాడ‌ని దాదా మీడియా స‌మావేశంలో తెలిపారు.

Tags : , , , , , , ,