భార‌త్ కు షాక్ ఇచ్చిన జింబాంబ్వే

admin
zimbawe

మూడు టీ-20 సీరిస్ లో భాగంగా శ‌నివారం హ‌రారే లో జ‌రిగిన మ్యాచ్ లో జింబాంబ్వే చేతిలో భార‌త్ ప‌రాజ‌యం చెందింది

జింబాంబ్వే ప‌ర్య‌ట‌న‌లో భాగంగా టీమ్ ఇండియా మూడు వంన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి టైటిల్ కైవసం చేసుకున్నాతొలి టీ-20 లో మాత్రం భార‌త్ కు పెద్ద షాక్ త‌గిలింది. శ‌నివారం ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లోభార‌త్ పై జింబాంబ్వే రెండు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జింబాంబ్వే నిర్ణీత 20 ఓవ‌ర్ల లో ఆరు వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు సాధించింది. జింబాంబ్వే బ్యాట్స్ మెన్ చిగుంబ‌ర 26 బంతుల్లో 54 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. చిబాబా 20, మ‌స‌క‌ద్జా25, సికింద‌ర్ రాజా20, వాల‌ర్ 30 ప‌రుగులు సాధించ‌డంతో జింబాంబ్వే గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ చేయ‌గ‌ల్గింది.

అనంత‌రం బ్యాటింగ్ కు దిగిన భార‌త్ ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ డ‌కౌట్ కాగా, మ‌న్ దీప్ సింగ్ 31ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించాడు. అంబ‌టి రాయుడు 19 ప‌రుగుల‌తో వెనుదిరిగాడు. దీంతో భార‌త్ 54 ప‌రుగుల‌కు మూడు కీల‌క వికెట్ల‌ను న‌ష్ట‌పోయింది. అనంత‌రం మ‌నీష్ పాండే 48 ప‌రుగుల‌తో మెరిపించినా అత‌నికి స‌రైన స‌హ‌కారం ల‌భించ‌క‌పోవడంతో భార‌త్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు. ధోనీ, కేద‌ర్ జాద‌వ్ 19 ప‌రుగుల‌తో నిరాశ‌ప‌రిచారు.

Tags : , , , , ,